వాతావరణ సమాచారం మరియు ప్రత్తిలో వేరుకుళ్ళు తెగులు నివారణ    

నల్గొండ జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం కంపసాగర్  వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ మరియు వాతావరణ సమాచారం: భారత వాతావరణ శాఖ వారి గణాంకాల ప్రకారం జిల్లాలో రానున్న 3 రోజులు ఆకాశం మేఘావృతంగా ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పడుతున్న వర్షాలకు ప్రత్తి చేనులో తేమ అధికంగా ఉండటం వలన వేరుకుళ్ళు తెగులు ఆశించే అవకాశం కలదు. ఈ తెగులు సోకిన మొక్కలు చేనులో గుంపులు గుంపులుగా చనిపోతాయి. ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు పై నుండి క్రింది వరకు వాడిపోయి వ్రేలాడుతూ కనిపిస్తాయి. నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపిన ద్రావణాన్నితెగులు సోకిన మొక్కలపాదుల చుట్టూ నేలపై పోయాలి.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.