రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వరి పైరు గింజ పాలు పోసుకునే దశలో మానిపండు తెగులు రావచ్చును. మొదట గింజలపై పసుపు పచ్చ ముద్దగా అభివృద్ధి చెంది ఆ తరువాత ఆకు పచ్చ ముద్ద వలె మారి గింజలు నల్ల బడతాయి. నివారణకు ట్రైఫ్లాక్సీస్ట్రోబిన్ మరియు టేబుకొనజోల్ ల మిశ్రమం 160 గ్రా లేదా పికాక్సీస్ట్రోబిన్ మరియు ప్రోపికొనజోల్ ల మిశ్రమం 400 మిలి లేదా ప్రోపికోనజోల్ 200 మిలీ ఎకరాకు సరిపడా 200 లీటర్ల నీటిలో కలిపి పొట్ట దశలో సాయంత్రం సమయంలో మాత్రమే పిచికారి చేయాలి. ధన్యవాదములు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.