నమస్కారం, రైతు సోదరులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" తరపున స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేస్తున్నారు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనమందరం కూడా మన నేల మన దేశం అను ప్రచారంతో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా నేల యొక్క ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడేందుకు రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి అని ప్రతిజ్ఞ చేద్దాం. భూసార పరీక్షలు చేసుకోవడం వలన నేలలో పోషకాల స్థాయి మరియు ఉదజని సూచిక నిర్దారించబడుతుంది. ఈ సమాచారంతో రైతులు తమ పొలాల్లో భూసారాన్ని కాపాడేందుకు అవసరమైన సేంద్రీయ మరియు రసాయనిక ఎరువులను ఎంత మోతాదులో వేయాలో ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన పంటల పెరుగుదలకు ఇది చాలా అత్యవసరం.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.