రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియుప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశిస్తుంది. ఈ పురుగు పూత దశలో ఆశించినపుడు ప్రత్తి చేనులో గుడ్డి పువ్వులు కనపడుతాయి. వీటిని వెంటనే వాటిని ఏరి నాశనం చేయాలి. గులాబీ రంగు పురుగు తల్లి రెక్కల పురుగుల ఉదృతిని గమనించటానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి. వాటిలో పడే రెక్కల పురుగుల ఆధారంగా మందులను మార్చి పిచికారి చేసుకోవాలి. నివారణకు ప్రొఫెనొఫాస్ 2 మి.లి. లేదా క్వినాల్ ఫాస్ 2 మీ.ల్ తో పాటుగా 1500ppm వేపనూనె 5 మి.లి/ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||