రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం గుంటూరు వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: పడిన వర్షాలకు ప్రత్తిలో నీరు నిలబడినట్లయితే వెంటనే మురుగు కాలువలు చేసి నీటిని బయటికి పంపాలి. పడిన వర్షాలకు ప్రత్తిలో కలుపు ఆశించే అవకాశం కలదు. ప్రత్తి చేనులో గడ్డిజాతి కలుపు మరియు వెడల్పాకు కలుపు మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడూ కలుపు నివారణకు 250 మీ.లీ పైరిథయోబాక్ సోడియం 6% మరియు 400 క్విజలోపాప్ ఈథైల్ 4% ద్రావకం మిశ్రమంను ఎకరానికి సరిపడా 200 లీటర్ల నీటిలో కలిపి కలుపు మొక్కలు తడిచేలా పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.