పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: గొర్రె పిల్లలలో పాలు మరిచే వరకు పాటించవలసిన యాజమాన్య పద్దతులు: పలు మరిచే వరకు(దాదాపు 3 నెలలు) గొర్రె పిల్లలపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. గొర్రె పిల్లలను తల్లితో పాటు మందతో పంపకుండా కొట్టంలో ఉంచి పెంచాలి. తల్లితో పాటు పంపినట్లు అయితే అధిక శక్తి వృధా అయి శరీర పెరుగుదల తగ్గుతుంది. ఇంటి దగ్గర పెట్టిన గొర్రె పిల్లలను గాలి, వెలుతురు సమృద్దిగా ఉండే కొట్టంలో తడికలు కత్తి అందులో వదలాలి. కొన్ని ప్రాంతాలలో గంప క్రింద గొర్రె పిల్లలను కప్పి పెడతారు. ఇలా చేయడం వలన దాని కింద చిత్తడిగా తయారై అమ్మోనియం వాయువు విడుదలై గొర్రె పిల్లలకు శ్వాసకోశ వ్యాధులు కలుగ చేస్తాయి. కొన్ని తల్లి గొర్రెలు పాలు సరిగా త్రాగించవు. అలాంటి వాటిని గమనించి తఅల్లిని పట్టి త్రాగించాలి. ఒకవేళ తల్లి దగ్గర పాలు తక్కువ ఉన్నట్లైతే పలు బాగా ఉన్న ఇంకొక తల్లి గొర్రె దగ్గర త్రాగించాలి
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.