పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: సూపర్ నేపియర్ అనే హైబ్రిడ్ అధునాతన మేలుజాతి గడ్డి రకం. ఈ రకం 14 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈ రకం గడ్డిలో 12 నుండి 14% మాంసకృత్తులు ఉంటాయి. ఈ రకం ఎకరాకు వార్షిక పచ్చిమేత దిగుబడి 200 టన్నుల వరకు వస్తుంది. ఇది చూడటానికి చెరుకు వలె ఉండి ఎత్తుగా పెరిగి, కాండం కూడా పశువు నమలటానికి, మృదువుగా, రుచికరంగా ఉంటుంది. సాగు నీటి లభ్యతను బట్టి 45 నుండి 60 రోజులలో మొదటి కోత, తదుపరి కోతలు ప్రతి 45 రోజులకొకసారి వస్తాయి. సం’రానికి 6 నుండి 7 కోతలు వస్తాయి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||