గొర్రెలు మరియు మేకల పెంపక దారులు తీసుకోవలసిన జాగ్రత్తలు

పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: గొర్రెలు మరియు మేకల పెంపక దారులు తీసుకోవలసిన జాగ్రత్తలు: మేకలను, గొర్రెలను ఉంచే పాక వర్షానికి కురవకుండా దాని మీద కమ్మలు వేయడం గాని, ప్లాస్టిక్ కవర్ లను కప్పి ఉంచడం గాని చేయాలి. పాక కురవడం ద్వారా అవి నిలబడే ప్రదేశంలో తేమ ఎక్కువగా ఉంటుంది. గొర్రెల పాకను కూడా తూర్పు పడమర దిశలో ఉండేటట్లు, నీరు నిల్వ ఉండకుండా ఎత్తైన ప్రదేశాలలో నిర్మించుకోవాలి. దీని వలన పాకలో తేమ తక్కువగా ఉంటుంది. పాకలో తడి ఎక్కువగా ఉన్నట్లు అయితే వీటి మలం తడితో కలసి పాకలో అమ్మోనియం ఎక్కువగా పెరిగి వాసన రావడం జరుగుతుంది. దీని వలన కండ్ల నుండి నీరు కారడం, న్యుమోనియా అనే వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags