రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు వరి పరిశోధన స్థానం రాజేంద్రనగర్ వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: వరిలో మానిపండు తెగులు లక్షణాలు మరియు నివారణ: వరి పంట పూత దశలో ఉన్నప్పుడూ, వర్షాలు పడినప్పుడు ఈ తెగులు అధికంగా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ తెగులును కలుగచేసే శిలీంద్రం వెన్నులు వేసే దశలో ఆశించినట్లైతే గొలుసు మెడపై నల్లటి మచ్చలు ఏర్పడి ఆ తరువాత ఎండిపోవడం వలన కంకులు విరిగిపోయి గింజలు తాలుగా మారుతాయి. రైతులు పూత దశలో తెగుళ్ళ మందులు పిచికారి చేయాలి. గింజ గట్టి పడే దశలో తెగుల్లా మందులు పిచికారి చేసిన ప్రయోజనం ఉండదు. వరి పైరు ఈనే దశలో ఒకసారి అంటే (10-15% పూత దశ) ఆ తరువాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో రెండవసారి కార్బండాజిమ్ 1 గ్రాము లేదా ప్రోపికొనజోల్ 1 మిల్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.