రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: చూడి పశువులలో పోషణ యాజమాన్యం: చూడి పశువులకు పచ్చి గడ్డి, ఎండు గడ్డితో పాటుగా 2 కిలోల దాణా మిశ్రమం కూడా ఇవ్వాలి. దాణాలో విటమిన్ ఎ మరియు విటమిన్ డి తో పాటుగా మినరల్ మిక్చర్ ను కలిపి ఇవ్వాలి. చూడి పశువుకు సమృద్దిగా పచ్చి మేత వెయ్యాలి. చూడితో ఉన్న పశువులకు దాని శరీర పోషణకు మరియు గర్భంలోని పిండం అభివృద్దికి అదనపు మేత మరియు దాణా అవసరం ఉంటుంది. కనుక చూడి పశువులు మంచి దూడను పెట్టి అధిక పాలను ఇవ్వాలంటే మంచి పోషణ చాలా అవసరం.చూడి పశువులలో ఈ విధంగా అధిక దాణాను అందించటాన్ని స్టీమింగ్ యాప్ అంటారు. స్టీమింగ్ యాప్ అనేది గర్భం యొక్క చివరి నెలలో అధిక సాంద్రత కలిగిన ఆహారం ఇవ్వడం వలన అవును ప్రసవ అనంతర సమయంలో తగినంత శక్తిని కలిగి ఉండటానికి సిద్దం చేస్తుంది
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.