రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుత వాతావరణ పరిస్తితులలో వరిలో సుడిదోమ అధికంగా ఆశించే అవకాశం ఉంది. కావున దోమ ఉదృతిని రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. పిల్లదశలోని తెల్లదోమలు దుబ్బుకి 20 నుండి 25 మించి మొదళ్ళ దగ్గర గమనించినటైతే నివారణకు ఎసిఫెట్+ఇమిడాక్లోప్రిడ్ ల మిశ్రమం 300 గ్రాములు. ఉదృతి ఎక్కువగా ఉంటే నివారణకు డైనోటేప్యూరాన్ 80 గ్రాములు లేదా పైమెట్రిజోన్ 120గ్రా లేదా ట్రైఫ్లూజోపైరిమ్ 98 మిల్ ఒక సరిపడా నీటిలో కలిపి మందు ద్రావణం మొదళ్ళ మీద పడేలా పిచికారి చేయాలి. అలాగే పొలాన్ని అడపాదడపా ఆరగట్టాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.