రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రత్తిలో గులాబి రంగు పురుగు ఉనికిని నిర్ధారించే లక్షణాలు: గుడ్డి పూలు, కాయ పై భాగంలో పురుగు బయటకు వచ్చే గుండ్రటి చిన్న రంధ్రం మరియు కాయతోనల మధ్య గోడలపై గుండ్రటి రంధ్రం, గుడ్డి ప్రత్తి మరియు రంగు మారిన ప్రత్తి ఈ లక్షణాలు గుర్తించిన వెంటనే రైతులు గులాబి రంగు పురుగు నివారణకు సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. ఈ పురుగు నివారణకు క్వినాల్ ఫాస్ 25 ec 2 మిల్ లేదా ప్రొఫెనొఫాస్ 2 మిల్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ప్రత్తి పంట ఆఖరి దశ కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సింథటిక్ పైరిత్రాయిడ్ మందులైన సైపర్ మెథ్రిన్ 25 ec 1 మిల్ లేదా లామ్డా సైహలోథ్రిన్ 5 ec 1 మిల్ లీటర్ నీటికి చొప్పున కలిపి మందులను పిచికారి చేయాలి
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.