జొన్నలో పశుగ్రాస యాజమాన్యం 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: పశుగ్రాస జొన్న ఏపుగా పెరిగి 3 నుండి 4 కోతలలో అధిక పశుగ్రాసాన్నిస్తుంది. పలు కోతల నిచ్చే రకాలలో CSH-24 యం. ఫ్ రకం మంచి దిగుబడినిచ్చే రకం ఎకరాకు 8 నుండి 10 కిలోల విత్తనాన్ని 30 సెం.మీ ఎడంగా ఉన్న సాళ్ళల్లో విత్తుకోవాలి. హెక్టార్ కి 30 కిలోల నత్రజని 50 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను వేసుకోవాలి. నాటిన 60 నుండి 65 రోజులకు అంటే 50 శాతం పూత దశలో కోత తీసుకోవచ్చు. తరువాత కోతలు 40 నుండి 45 రోజుల వ్యవధిలో తీసుకోవచ్చు. నీటి వసతి క్రింద 3 నుండి 4 కోతలలో కొన్న హెక్టార్ కి 60 నుండి 70 టన్నుల పచ్చిమేత దిగుబడినిస్తుంది

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags