రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వేరుశెనగ కోతకు సిద్ధంగా ఉన్న రైతులు సరి అయిన వాతావరణ పరిస్థితులను గమనించి కోత చేపట్టాల్సిందిగా సూచిస్తున్నాము. మొక్కల ఆకులు మరియు కొమ్మలు 70-80 శాతం పసుపు వర్ణంగా మారి, కాయ డొల్ల లోపలి భాగము నలుపుగా మారినపుడు కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. కాయలో తేమ శాతం 9 లోపు ఉండేటట్లు ఆరబెట్టి పాలిథిన్ లైనింగ్ వున్న గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||