రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం ప్రస్తుతం ప్రత్తి పంట పూత మరియు కాయ దశలో ఉంది. ఈ దశలో ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించే అవకాశం ఎక్కువుగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు ఉధృతి ని గమనించడానికి లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 అమర్చి వాటిలో పడే రెక్కల పురుగుల ఆధారంగా సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. ఉదృతి ఎక్కువగా ఉంటే నివారణకు సైపర్ మెథ్రీన్ 1 మిల్ లేదా లామ్డా సైహలోథ్రిన్ 1 మిల్ లేదా థయోమిథాక్సమ్ + లామ్డా సైహలోథ్రిన్ 0.4 మిల్ లేదా ప్రొఫేనోఫాస్ 2 మీ.లి మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.ఈ మందులను మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.