రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: అధిక మాంసకృత్తులు కలిగి తక్కువ కాలపరిమితి గల మంచి దిగుబడితో రబీ పంట కాలంలో సాగు చేసుకొను పంటలలో బర్సీమ్ ప్రధానమైనది. ఇందులో బి.బి 2, బి.బి 3, పూసా జైయింట్, వర్ధన్, మెస్ కావి మొదలగు రకాలు సాగులో ఉన్నవి. ఇవి పశువులలో పాల దిగుబడి పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నవి. ఒక ఎకరానికి 12 నుండి 14 కిలోల విత్తనం అవసరం. వరుసల మధ్య దూరం 25 నుండి 35 సెం.మీ ఉండేటట్లు విత్తుకోవాలి. విత్తే ముందు డుక్కీలో 8 టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం పోషకాలను వేసుకోవాలి. విత్తిన 55 రోజులకు పంట కోతకు వచ్చును. ఎకరానికి 30 నుండి 35 టన్నుల వరకు పచ్చి మేత దిగుబడి వచ్చును.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.