రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: మినుములో పల్లాకు తెగులు నివారణ: మినుములో పల్లాకు తెగులు జెమిని వైరస్ వలన కలుగుతుంది. ఈ తెగులును కలుగ చేయు వైరస్ కాల్పు మొక్కలు మరియు తెగులు సోకిన ఇతర పంట మొక్కల నుండి తెల్లదోమ ద్వారా మినుము పంటకు వ్యాప్తి చెంది అధిక నష్టం కలుగ చేస్తుంది. ఈ తెగులు సోకిన మొక్కలలోని ఆకులపై పసుపు మరియు ఆకు పచ్చరంగు మచ్చలు కనపడుతాయి. ఈ తెగులు పూత మరియు పిందే దశలలో ఆశించినట్లయితే పిందేలు, కాయలు పసుపు రంగులోకి మారి వంకరలు తిరిగి తాలు కాయలుగా మారిపోతాయి. కాయ దశలో ఈ తెగులు ఆశించినట్లయితే దిగుబడిలో పెద్దగా నష్టం కలుగనప్పటికి గింజలు పసుపు రంగుకు మారి నాణ్యత తగ్గడానికి అవకాశం ఉంది. ఈ తెగులు నివారణకు ఎకరాకు 20 చొప్పున పసుపు రంగు జిగురు అట్టలను అక్కడక్కడ అమర్చాలి. విత్తిన 15 లేదా 20 రోజులకు 1500 ppm వేపనూనె 5 మి.లీ ఒక లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ నివారణకు ఎసీటామిప్రిడ్ 0.2 గ్రా లేదా డైమిథోయేట్ 2 మిల్ లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||