రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం వర్షాలు తగ్గిన తరువాత ప్రత్తిలో రైతులు చేయవలసిన పనులు: వర్షాలు తగ్గగానే వీలైనంత త్వరగా మురుగు నీరు తొలగించి అంతర కృషి చేసి నేల ఆరునట్లు చేయాలి. అధిక తేమ వలన మొక్కలు భూమి నుండి పోషకాలను గ్రహించే స్థితిలో ఉండవు. అటువంటి పరిస్తితులలో మొక్కలు ఎర్రబడటం వడలటం, ఎండిపోవడం జరుగుంది. దీని నివారణకు 20 గ్రాముల యూరియా లేదా 20 గ్రాముల పొటాషియం నైట్రేట్ తో పాటుగా 10 గ్రాముల మెగ్నీషియం సల్ఫెట్ ను లీటర్ నీటికి కలిపి 5 నుండి 7 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయండి. పిచికారి ఎండ ఉన్న సమయంలో మాత్రమే చేయాలి. చల్లగానున్న సమయంలో పిచికారి చేసినట్లయితే నీటి ముంపునకు గురైన మొక్కలు పోషకాలను సమర్ధవంతంగా తీసుకోలేవు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.