రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం వుంది. దీని పిల్ల పురుగులు మొదట ఆకుల పైన పత్రహరితాన్ని గోకి తింటాయి. ఆ తరువాత ముడుచుకుని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరుతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండు సూది మాదిరి రంధ్రాలు వరుస క్రమంలో కనిపిస్తాయి. దీని లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోతుంది. ఈ పురుగు నివారణకు క్లోరంట్రానిలిప్రోల్ ఎకరాకు 60 మి.లీ మందును ఎకరాకు సరిపడా 200 లీటర్ల నీటిలో కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేయాలి. ఉదృతి ఎక్కువగా వుంటే కార్బొఫ్యురాన్ 3జి గుళికలు ఎకరాకు 3 కిలోలు చొప్పున పైరు మొలకెత్తిన 25-30 రోజులకు ఆకుల సుడులలో వేసుకోవడం వలన కాండం తొలుచు పురుగును అదుపు చేయవచ్చును
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||