పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం గేదెల పాకలు వేసవిలో చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. పశువుల పాక, పైకప్పు భాగంలో గడ్డి, తాటాకులు కప్పి కప్పు పై నీటిని చల్లించాలి. పశువుల పాక పరిసరాల్లో చెట్లు ఎక్కువగా పెంచాలి. గేదెల శరీరం నల్లగా ఉండటం వల్ల అవి ఎక్కువగా ఉష్ణోగ్రతను గ్రహించి పోషక ఆహారాలను తీసుకోవడం తగ్గిస్తాయి. గేదెలను చల్లటి నీటితో రెండు మూడు సార్లు కడగాలి. వేసవిలో పశువులను ఎండలో మేపకుండా ఉదయం 10 గంటలలోపు, సాయంత్రం 5 గంటల తరువాత ఆరు బయట మేపాలి. వేసవికాలంలో ఎక్కువగా పచ్చిమేత వేయాలి. పచ్చిమేతలో నీటి శాతం ఎక్కువగా ఉండి, పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గేందుకు దోహదం చేస్తాయి. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||