రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: జొన్న పైరు విత్తిన 30 రోజుల తరువాత నుండి పంట కోసే వరకు కాండం తొలుచు పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. ఈ పురుగు ఆశించినపుడు గుండ్రని వరుస రంధ్రాలు ఆకులపై ఏర్పడుతాయి. మొవ్వు చనిపోయి తెల్ల కంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది.ఈ పురుగు నివారణకు క్లోరంట్రానిలిప్రోల్ 0.3 మిల్ మందును లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి. లేదా విత్తిన 35 నుండి 40 రోజులలోపు ఎకరాకు 4 కిలోల కార్బోఫ్యురాన్ 3జి గుళికలను కాండపు సుడుల్లో వేయాలి
Comment | Author | Date |
---|---|---|
Be the first to post a comment... |
Copyright © 2025 Reliance Foundation. All Rights Reserved.