రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో మహిళల యొక్క పాత్ర: పాలు పితికే మహిళలు ఆరోగ్యంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం మరియు నీరసంతో ఉన్న ఉన్న మహిళలు పాలు పిండరాదు. పాలు పిండే మనిషి శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకుని తల శుభ్రంగా దువ్వుకుని నెత్తికి టోపీ పెట్టుకుని పాలు పిండాలి. గోర్లు కత్తిరించుకుని చేతులు శుభ్రంగా కడుక్కుని పొడి గుడ్డతో తుడుచుకుని పాలు పిండాలి. పాలు పిండేటప్పుడు మాట్లాడటం, దగ్గడం, తుమ్మడం చేయరాదు. అలా చేస్తే పాల సూక్ష్మ క్రిములు ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు పాలు పితికే మనిషిని మార్చరాదు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.