పశువులలో బాహ్యపరాన్న జీవుల నివారణ

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: పశువులలో బాహ్యపరాన్న జీవుల నివారణ: చలికాలంలో పశువులను బాహ్య పరాన్న జీవులనుండి రక్షించు కోవడానికి డీవార్మింగ్ చేయవలెను. పశువులను, జీవాలను బాహ్య పరాన్న జీవుల నుండి కాపాడుకోవడానికి పాకలను, షెడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వేపనూనె సంభందిత క్రిమిసంహారక మందులతో పిచికారి చేసుకోవలెను. అలాగే నిమ్మగడ్డి, తులసి, వావిలాకు, చెట్లను కట్టలుగా కత్తి పాకల్లో వ్రేలాడదీసినట్లయితే వాటి నుండి వెలువడే వాసనకు బాహ్యపరాన్న జీవులు వికర్షించబడతాయి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags