రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: పెరటికోళ్ళకు సకాలంలో వైరస్ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వీటి వయసును బట్టి టీకాలు ఇవ్వాలి. ఒక రోజు వయసు కోడి పిల్లలకు మారెక్స్ వ్యాధికి, 4 నుండి 7 రోజుల వయసు పిల్లలకి రానికేట్ వ్యాధికి, 14 నుండి 18 రోజులకు గంభోరా వ్యాధికి, 35 రోజుల దశలో రానికేట్ వ్యాధికి, 6 నుండి 7 వారాలప్పుడు పౌల్ ఫాక్స్ వ్యాధికి టీకాలివ్వాలి. పెరటికోళ్ళను బాహ్య మరియు అంతర పరాన్నజీవులనుండి కాపాడుటకు ప్రతి రెండు నెలలకు ఒక సారి నట్టల నివారణ మందులను వాడవలెను. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.