రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో పాల పాత్రల యొక్క పాత్ర: పాలు పితకడానికి కప్పు గల పాత్రలు ఉపయోగిస్తే మంచిది. వీలైనంత వరకు స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు ఉపయోగించాలి. పాలు పిండడం అయిపోగానే పాత్రలన్నిటిని వేడి నీటితో గాని, క్లోరిన్ కలిపిన ద్రావణంతో గాని కడిగి తడి ఆరిపోయేటట్లు బోర్లించి శుభ్రమైన చోట నిలువ ఉంచాలి. వాటిపై ఎండ తగిలితే మంచిదే గాని, దుమ్ము ధూళి పడకుండా పాల పాత్రలన్నింటికి మూతలు ఉంచాలి. లేదా బోర్లించి ఉంచాలి
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||