రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: పాలు ఇచ్చు పాడి పశువుల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: పాలు ఇచ్చే పశువులు ఆరోగ్యంగా ఉండాలి. ఎలాంటి వ్యాధులు ఉండకూడదు. ముఖ్యంగా పొదుగు వాపు వ్యాధి ఉండకూడదు. పాలు పిండే ముందు పశువును శుభ్రమైన నీటితో గాని, పొటాషియం పర్మాంగనెట్ కలిపిన ద్రావణంతో గాని కడిగి పొడి గుడ్డతో తుడవాలి. తోక కదలించకుండా ఒక కాలికి కట్టి ఉంచాలి. మందలోని పాడి పశువులను ఈ క్రమంలో పాలు పిండినట్లయితే పాల నాణ్యత తగ్గకుండా ఉండుటయే కాకుండా పొదుగు వాపు కూడా ఒక పశువు నుండి మరొక పశువుకు వ్యాపించకుండా ఉండగలదు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||