పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: వేసవి తాపానికి పశువుల జీర్ణ వ్యవస్థలో జీర్ణ రసాలు తగిన మోతాదులో ఉత్పత్తి కాకపోవటం వలన జీర్ణక్రియ మందగిస్తుంది. పాడి పశువులకు మేత సరిగా వేయకపోవడం వలన పాల దిగుబడి తగ్గిపోతుంది. అందువల్ల తేలికగా జీర్ణమయ్యే పచ్చి మేతలను జావ, మిశ్రమ దాణాలతో ఉప్పును కలిపి తినిపించాలి. పరిశుభ్రమైన చల్లని నీటిని రోజుకు 3 నుండి 4 సార్లు తాగేందుకు పశువులకు అందుబాటులో ఉంచాలి. పాలు పితికే ముందు పశువు శరీరాన్ని పొదుగును చల్లని నీటితో కడగడం ద్వారా పాల దిగుబడి తగ్గకుండా చూడవచ్చు. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశుసంవర్ధక శాఖ
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||