రైతులు పురుగు మందుల కొనుగోలు మరియు వాడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: రైతులు పురుగు మందుల కొనుగోలు మరియు వాడే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు: మొదటగా సాగు చేసిన పంటలో పురుగు లేదా తెగులు ఆశించిన లక్షణాలను గుర్తించి వెంటనే రసాయన మందుల జోలికి వెళ్లకుండా ముందు నుండే సమగ్ర సస్య రక్షణ పద్దతులను ఆచరించాలి. చివరి అస్త్రంగా మాత్రమే పురుగు మందులను ఉపయోగించాలి. పురుగు దశను అనుసరించి మందులను ఎంపిక చేసుకోవాలి. మందులను కొనుగోలు చేసేటప్పుడు ఆ పంటలో సిఫారసు చేసిన వాటినే తీసుకోవాలి. పురుగు మందుల డబ్బాలు మరియు ప్యాకెట్ ల పై ఉన్న అనమతుల సమాచారాన్ని పూర్తిగా చదివి బ్యాచ్ నెంబర్, తయారీ తేదీ మరియు కాల పరిమితి వంటి వివరాలను జాగ్రత్తగా గమనించాలి. ఎంచుకున్న మందులను అధీకృత డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు విధిగా రసీదులను తీసుకోవాలి. మందులను కొన్న తరువాత రెండు రోజుల్లోనే పిచికారి చేసే విధంగా ఉండాలి. లేదంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మందులను భద్రపరిచే స్థలం చిన్న పిల్లలకు, మూగ జీవులకు దూరంగా ఉంటే మంచిది. ఎండలకు, వానలకు పాడవకుండా రక్షణ ఉండే స్థలంలో ఉంచాలి.  

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags
Get In Touch

Reliance Corporate Park 5 TTC Industrial Area,

Thane-Belapur Road, Ghansoli,

Navi Mumbai - 400701, Maharashtra

Follow Us

Kisan Grow

Machli

Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.