రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: పిచికారి చేసే సమయంలో రైతులు తప్పకుండా పాటించవలసిన కొన్ని మెళకువలు: మందు ద్రావణానికి ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలి. పిచికారి చేసే మందు ద్రావణాన్ని, నీటిని సూచించిన మోతాదులో మాత్రమే వాడుకోవాలి. సాధారణ పొడి వాతావరణ పరిస్తితుల్లో మాత్రమే పిచికారి చేసుకోవాలి. ఎండ ఎక్కువగా లేదా వర్షాలు కురుస్తున్న సమయంలో పిచికారి చేయకూడదు. పురుగు మందులను, తెగుళ్ళ మందులను, కలుపు మందులను మరియు పోషకాలను కలిపి వాడకూడదు. విడివిడిగా మాత్రమే పిచికారి చేయాలి. రసాయనాలను పొలంలో పిచికారి చేసే సమయంలో శరీరానికి రక్షణ తొడుగులను తప్పనిసరిగా వాడాలి. గాలికి ఎదురుగా ఎప్పుడు పిచికారి చేయకూడదు. చివరగా పిచికారి చేసే సమయంలో తినడం, పొగ త్రాగడం వంటి పనులు చేయకూడదు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.