రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: రైతులు విత్తనం తీసుకునే ముందు తెలుసుకోవలసిన విత్తన నాణ్యత ప్రమాణాలు: భారత విత్తన చట్టం 1966 ప్రకారం మార్కెట్లో అమ్మబడే విత్తనాలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు కనీస జన్యుశుద్ధత, భౌతిక శుద్ధత, మొలక శాతం ఉండాలి. ఎక్కువ శాతం పంటలలో ధృవీకరణ విత్తనాలకైనా, ట్రూత్ ఫుల్ లేబిలింగ్ విత్తనాలకైనా కనీస జన్యుశుద్ధత 98% ఉండాలి. మొలక శాతం 75 నుండి 80% ఉండాలి. భౌతిక శుద్ధత కూడా కనీసంగా 98% ఉండాలి. హరిత విప్లవం, అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో వేగంగా విస్తరిస్తున్న విత్తన పరిశ్రమ, నాణ్యమైన విత్తనాల వాడకంపై రైతులు ఎక్కువ మొగ్గు చూపడం వంటి అంశాల దృష్ట్యా విత్తన నాణ్యత నియంత్రణ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విత్తనోత్పత్తి ప్రోత్సహించి, నాణ్యత నియంత్రణకు వ్యవస్థీకృతమైన చర్యలను చేపట్టే దిశగా పలు చట్టాలను తీసుకురావడం జరిగింది
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.