రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న సమాచారం: వ్యవసాయ శాఖ వారు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను 50% రాయితీ పై అందచేస్తున్నారు. ఈ విత్తనాలు కావల్సిన రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ కార్డులు తీసుకుని వచ్చి ముద్ర వేసి విత్తనాలు రిజిస్ట్రేషన్ చేసుకుని అమౌంట్ కట్టిన యెడల విత్తనాలు తెప్పించబడును. కావున విత్తనాలు కావలసిన రైతులు రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము. విత్తనాల ధరలు జీలుగ- 10కిలోలు -440 రూపాయలు, కట్టి జనుము 10 కిలోలు 440 రూపాయలు పిల్లిపెసర 8 కిలోలు 536 రూపాయలకు అందచేస్తున్నారు. జనుము, జీలుగ మరియు పిల్లి పెసర సాగు చేయటం వలన భూమిలో సేంద్రీయ కర్బన శాతం పెరుగుతుంది. పచ్చి రొట్టపైర్ల సాగు వలన నేల భౌతిక స్థితి మెరుగుపడి భూమి గుల్లగా మారి నేలలోనికి నీరు ఇంకే గుణం పెరుగుతుంది. చౌడు భూముల పునరుద్ధరణకు పచ్చి రొట్టపైర్లు బాగా ఉపయోగపడతాయి. భూమిలో రసాయన ఎరువులు వేసినప్పుడు వాటి లభ్యత పెరగడానికి హరిత ఎరువులు ఉపయోగపడతాయి. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.