వేసవికాలంలో గొర్రెలు మరియు మేకలకు మేత యాజమాన్యం

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న పశుపోషణ సమాచారం: వేసవికాలంలో గొర్రెలు మరియు మేకలకు మేత యాజమాన్యం: పాడి పశువులకు అందించినట్టుగానే గొర్రెలు మరియు మేకలకు సూపర్ నేపియర్, కో1, కో2 మొదలగు రకాల నేపియర్ గడ్డిని పెంచి వీటికి ఆహారంగా అందిచవచ్చు. గొర్రెలు మరియు మేకలకు పెంచే వారు గడ్డిని పెంచేందుకు కొంత స్థలాన్ని కేటాయించాలి. నేపియర్ రకాలు బహువార్షికలు కనుక 4-5 సంవత్సరాల వరకు దిగుబడి ఆశించవచ్చు. పచ్చిగడ్డి మరియు ఆకులతో పాటు దాణా కూడా అందిస్తే జీవాలకు శరీర ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభిస్తాయి. జీవాలు వేసవి కాలంలో రోగాల భారిన పడే అవకాశం ఎక్కువ. రాగాలతో పాటు పిడుధులు, గోమార్లు, పొట్ట జలగలు, లాంటివి సోకె అవకాశం ఎక్కువ. ఇవి కనిపించినప్పుడు బ్యూటాక్స్, సైపర్మేథీరిన్, డెల్టామేథీరిన్ మందులు నిర్ధేశించిన పరిమాణంలో నీటిలో కలిపి వీటి మీద పిచికారీచేయాలి. రోగాలు కనిపించిన వెంటనే పశు వైద్యున్ని సంప్రదించి చికిత్స అందించాలి.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags