నాగర్ కర్నూల్ జిల్లా రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం పాలెం వారు సంయుక్తంగా అందిచుచున్న వాతావరణ మరియు పశుపోషణ సమాచారం: : భారత వాతావరణ శాఖ వారి గణాంకాల ప్రకారం జిల్లాలో రానున్న 3 రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వేసవికాలంలో పశువులకు షెల్టర్ యాజమాన్యం: పశువులను ఎండ తీవ్రత నుండి రక్షించడానికి అనుకూలంగా ఉండే గృహ వసతి ని కల్పించాలి. పాకల్లో గాలి వెలుతురు ప్రసరించడానికి వీలుగా పాకల ఎత్తు సుమారు 12 అడుగులు ఉండాలి. ఇరువైపులా గోడలు 4 నుండి 6 అడుగులు నిర్మించాలి. పాకాల చుట్టూ సుబాబుల్, ఆవిశే లాంటి చెట్లు పెంచినట్లయితే నీరు ఇవ్వడమే కాకుండా ఎండాకాలంలో పశుగ్రాసంగా కూడా ఉపయోగపడతాయి
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||