రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న పశుపోషణ సమాచారం: గొర్రె పిల్లలో నట్టల నివారణ: గొర్రె పిల్లలు 2 వారాల వయస్సు తరువాత మొదటి సారి నట్టల నివారణ మందు తాపాలి. నట్టల మందు త్రాపునప్పుడు ఊపిరితిత్తులలోనికి మందు పోకుండా జాగ్రత్తగా త్రాగించాలి. నట్టల మందు త్రాగించిన 10 నుండి 15 రోజుల వ్యవధిలో చిటుక వ్యాధి టీకా మందు ఇవ్వాలి. తరువాత 15 రోజులకు బూస్టర్ డోసు టీకా ఇవ్వాలి. గొర్రె పిల్లలకు చిటుక వ్యాధి టీకా ఇచ్చిన 30 రోజుల తరువాత బొబ్బరోగానికి టీకా మందు ఇవ్వవలసి ఉంటుంది. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||