రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: రైతు స్థాయిలో మట్టి నమూనా సేకరణలో తీసుకోవలసిన జాగ్రత్తలు: పొలంలో V ఆకారంలో 15 సెం’మీల లోతు పారతో గుంత తీసి అందులో పై పొర నుండి క్రింది వరకు ఒక ప్రక్కగా మట్టిని సేకరించాలి. ఇలా సేకరించిన మట్టిలో రాళ్ళు, పంట అవశేషాలు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా మట్టిని ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల సేకరించాలి. ఈ మట్టిని ఒక దగ్గర చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదుటి భాగాలు తీసుకుని, మిగితా భాగాలు తీసివేయాలి. ఈ విధంగా మట్టి ½ కిలో వచ్చే వరకు చేయాలి. మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రీయ ఎరువుల సంచులను వాడరాదు. శుబ్రమైన ప్లాస్టిక్ షీట్ లను వాడాలి. ఈ విధంగా సేకరించిన మట్టి నమూనాను కృషి విజ్ఞాన కేంద్రంలో, వ్యవసాయ పరిశోధన స్థానాలలో కానీ, మట్టి నమూనా పరీక్ష కేంద్రాలలో ఇవ్వాలి. ఈ మట్టి నమూనా పొలం గట్ల దగ్గర, పంట కాలువల దగ్గర, చెట్ల నీడ భాగాన, మట్టికుప్పల దగ్గర మట్టిని సేకరించరాదు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.