రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రత్తి పొలాల్లో నీళ్లు నిలిచి ఉండడం వల్ల పారా విల్ట్ తెగులు ఆశిస్తుంది. కావున పొలాల్లో వర్షాలకి నీళ్లు నిలిచిన ప్రత్తి మొక్కలు మొదటగా వడలిపోయి తరువాత ఎర్రగా మారి ఎండిపోవడం జరుగుతుంది. ప్రత్తి చేనుల్లో నిలిచిన మురుగు నీటిని బయటకు కాలువల ద్వారా బయటకు పంపాలి. వర్షాలు ఆగిన తర్వాత కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రాములతో మొక్కల మొదళ్ళను తడిచెలా పిచికారి చేయాలి. ఆ తర్వాత 5 గ్రాముల 19:19:19ను లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||