రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: పాడి పశువులలో వచ్చే పొదుగు వాపు అనేది వాతావరణంలో వున్న తేమ, పాకలు ఎప్పటికప్పుడు అరకపోవడం వల్ల అనగా పాకలోని నేలపైన వున్న మురుగు నీరు , పేడలను ఎప్పటికప్పుడు తీసివేయకపోడం వల్ల వచ్చే ఈ అపరిశుభ్రమైన మురుగు నీటి మీద పశువులు పాలు పితికిన వెంటనే పడుకోవడం వలన, పొదుగు లోకి క్రిములు చేరి ఎక్కువగా ఈ వర్షా కాలం లో సోకుతుంది. ఒక్కసారి ఈ పొదుగు వాపు సొకితే పాడి పశువుల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పాలు తీయక ముందే పాకల్లో వున్న పేడ ను తీసివేసి పరిశుభ్రంగా నీటితో కడిగిన తర్వాత పాలను తీసినట్లయితే , పాలు తీసిన వెంటనే పశువుల కి వచ్చిన నీరసం వలన ఒకేసారి క్రింద పడుకున్నప్పుడు పొదుగు లోకి క్రిములు చేరకుండా ఆపడానికి అవకాశం కలదు. తద్వారా ఈ పొదుగు వాపు ను నివారించవచ్చు. ఈ పొదుగు వాపు రాకుండా పాలు తీయక ముందు అదేవిధంగా పాలు తీసిన తర్వాత డిసిన్ఫెక్ట్స్ కలిపిన నీటితో ఈ పొదుగుని పరిశుభ్రం చేసినట్లైతే పొదుగు వాపు ను నివారించవచ్చు. అలాగే పొడి సున్నం మరియు బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేసి పాకలలో చల్లుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.