ప్రత్తిలో లింగాకర్షణ బుట్టలను అమర్చుట 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్  వారు సంయుక్తంగా అందించుచున్న వ్యవసాయ సమాచారం: ప్రత్తి పంట విత్తిన 45 రోజుల నుండి గులాబి రంగు పురుగు ఉదృతిని గమనించడానికి ఎకరానికి 4 లింగాకర్షణ బుట్టలు అమర్చి బుట్టలో మూడు రోజులలో, 8 తల్లి రెక్కల పురుగులను పడటం గమనించినట్లయితే లేదా చేనులో 10% గుడ్డి పువ్వులు  లేదా 10% లార్వా పురుగులు ఆశించిన కాయలు గమనించిన వెంటనే సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. ఎకరానికి 10 లింగాకర్షణ బుట్టలు పెట్టుకుంటే పురుగుల ఉదృతిని నియత్రించవచ్చు. లింగాకర్షక బుట్టల ఆధారంగా పురుగుల ఉదృతిని అంచనా వేసుకుని నష్టపరిమితి చేరే సమయంలో ఎకరాకు 4 కార్డుల ట్రైకోగ్రామ గుడ్డు పరాన్న జీవిని ప్రత్తి చేనులో వదులుకోవాలి.  

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags