పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక వారి సమాచారం. లంపి స్కిన్ వ్యాధి సోకిన జంతువుల్లో జ్వరం, కళ్ళు, ముక్కు నుండి స్రావాలు కారుతుంటాయి. శరీరమంతా పొక్కులు, మచ్చలు ఏర్పడతాయి. నోటిలో బొబ్బలు వస్తాయి. పాల ఉత్పత్తి తగ్గుతుంది. తినడానికి పశువులు ఇబ్బంది పడుతుంటాయి. దీంతో పశువులు మృతి చెందుతుంటాయి. ఈ లక్షణాలు గమనించిన వెంటనే మీ దగ్గర్లోని పశు వైద్యాధికారి సంప్రదించాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||