పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశు సంవర్ధఖ శాఖ సంయుక్తం గా అందించే సమాచారం: పాడి పశువులకు పాల రోగం ప్రమాదకరమైంది. ఈ వ్యాధి తో పశువుల రక్తంలోని కాల్షియం తగ్గి రక్త ప్రసరణ జరగదు. ఇది జాఫర్ బాడీ, జెర్సీ ఆవులలో ఎక్కువగా కనిపిస్తుంది. పశువులు ఈనిన మొదటి వారంలో ఈ వ్యాధి సోకుతుంది. ఏడు నుండి పదేళ్ళ వయసున్న పశువులకు ఇది వస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు మూడు దశలుగా ఉంటుంది. ఈ వ్యాధి సోకిన మొదటి దశలో పశువు మేత మేయదు. రెండవ దశలో సరిగా నిలబడేందుకు ఇబ్బంది పడుతుంది. అలాగే శ్వాస తీసుకోవడం కష్టమై పశువు నాడి పని చేయదు. చివరి దశలో శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి కడుపు ఉబ్బరం లక్షణాలు కనిపిస్తాయి. కండరాల వణుకుతో చలనం లేకుండా ఉంటాయి. సకాలంలో పశువుకు వైద్యం అందించకుంటె పశువు మరణిస్తుంది. పశువులలో పోషక లోపం వల్లే ఈ వ్యాధి వస్తుంది. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||