పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం: పశువులు ఈనె 3 నెలల ముందు నుండి మంచి పోషక విలువలతో దాణాను పశువుకు అందించినట్లయితే పశువులలో పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో కాల్షియం లోపం మరియు కీటోసిస్ (పాలు క్షారత) లేదా బరువు తగ్గడం వంటి వ్యాధులు ఆశించే అవకాశం కలదు. ఈ సమయంలో జంతువు బరువును బట్టి మంచి పోషక విలువలతో దాణాను ఇవ్వాలి. అంటే 5 క్వింటాళ్ల బరువున్న జంతువుకు ఉదయం 2.5 కిలోల దాణా మరియు సాయంత్రం 2.5 కిలోల దాణా ను ఇవ్వాలి. తాజా పచ్చి మేతకు బదులుగా జంతువులకు రోజు ఒకసారి మంచి నాణ్యమైన పప్పు దినుసులు లేదా జొన్న లేదా మొక్కజొన్న ఆహారంగా ఇవ్వాలి. కాల్షియంతో పాటుగా మినరల్ మిక్స్చర్ మొదలైన వాటిని పాలు పితికే సమయంలో ఇచ్చినట్లయితే పశువు ఆరోగ్యంగా మరియు పాల దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ సమాచారం అందించిన వారు జిల్లా పశు సంవర్ధక శాఖ.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.