రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: వానాకాలం ప్రత్తి సాగు చేసే రైతులు ఎకరాకు 4 టన్నుల బాగా మాగిన పశువుల ఎరువు లేదా సేంద్రీయ ఎరువును దుక్కిలో వేసి కలియదున్నాలి. దీని వలన నేలలో భూసారం మరియు నేల యొక్క భౌతిక, రసాయనిక స్వభావం మెరుగుపడటంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఎక్కువ కాలం ప్రత్తి సాగు చేస్తున్న భూములలో వేరుకుల్లు తెగుళ్లు ఆశించే అవకాశం కలదు. ఈ నేలలో పంట మార్పిడి తప్పని సరిగా చేసుకోవాలి. అలాగే ఎకరాకు 200 కిలోల వేపపిండిని దుక్కిలో వేసుకోవాలి.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved. Terms & Conditions. Privacy Policy.