వనరాజా పెరటికోళ్ళ పెంపకంలో మెళకువలు

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: వనరాజకోళ్ళు పెరట్లో పెంపకానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గ్రుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి. వీటి కాళ్ళు పొడవుగా ఉండటం వలన కుక్కలు, పిల్లులు, మరియు గ్రద్దల బారి నుండి తప్పించుకోగలవు.పెట్టలు సంవత్సరానికి 150 గ్రుడ్ల వరకు పెడతాయి. ఈ కోళ్ళు 5 నెలల వయసు నాటికి 2.5 కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి. ఈ కోళ్ళు ఆరు వారాల వయసు దాటిన తరువాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తిరగటానికి వదిలి వేయాలి. 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags