వనరాజా పెరటికోళ్ళ పెంపకంలో మెళకువలు

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశుసంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: వనరాజకోళ్ళు పెరట్లో పెంపకానికి అనువుగా ఉంటూ అధిక సంఖ్యలో గ్రుడ్లు మరియు మాంసాన్ని ఇస్తాయి. వీటి కాళ్ళు పొడవుగా ఉండటం వలన కుక్కలు, పిల్లులు, మరియు గ్రద్దల బారి నుండి తప్పించుకోగలవు.పెట్టలు సంవత్సరానికి 150 గ్రుడ్ల వరకు పెడతాయి. ఈ కోళ్ళు 5 నెలల వయసు నాటికి 2.5 కిలోల వరకు బరువు పెరిగి అధిక పోషకాలతో కూడిన మాంసాన్ని అందిస్తాయి. ఈ కోళ్ళు ఆరు వారాల వయసు దాటిన తరువాత పెరటి వాతావరణానికి అలవాటు చేస్తే పెరట్లో తిరగటానికి వదిలి వేయాలి. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.  

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags