మేకలలో పిపీఆర్‌ వ్యాధి లక్షణాలను గుర్తించుట మరియు నివారణ

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం మామునూరు వారు సంయుక్తంగా అందించుచున్న పశుపోషణ సమాచారం: మేకలలో పిపీఆర్‌ (PPR) వ్యాధి లక్షణాలను గుర్తించుట మరియు నివారణ: ఒక సంవత్సరము వయసు ఉన్న మేక పిల్లల్లో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి మార్‌టిల్లి వైరస్‌ వలన కలుగుతుంది. ఈ వైరస్‌ వ్యాధిగ్రస్త పశువు యొక్క మల మూత్రములో మరియు ముక్కు మరియు కంటి నుండి వచ్చే స్రావాలలో అధికంగా ఉంటుంది. సరిపడ గాలి మరియు వెలుతురు అందకపోవడం ఈ వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. వైరస్‌తో కలుషితమైన నీటిని మరియు ఆహారము తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఇతర పశువులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన మేకలు సంతనుండి కొనుగోలు చేసి కొత్తగా మందలో కలిపినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. శ్వాసకోశ మరియు జీర్ణ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు అనేవి మనకు కనిపిస్తాయి. ఈ వ్యాధి సోకిన మేకలో అధిక జ్వరం ఉంటుంది. ఆకలి మందగిస్తుంది, మేత మేయవు. పశువు శరీర ఉష్ణోగ్రతను బట్టి ఆంటీపైరెటిక్స్‌ మరియు ఆంటిబయోటిక్స్‌ విరోచనాలకుగాను ఆంటి డయేరియల్‌ ఔషధములను ఇవ్వాలి. నోటి పుండ్లకు బోరాక్స్ పౌడర్ + గ్లిసరిన్ ను పట్టించాలి. PPR వ్యాధి సోకిన మేకలను వెంటనే మంద నుండి వేరు చెయ్యాలి.  మూడు మాసాలు దాటిన మేకలకు తప్పనిసరిగా ఈ టీకాలు వేయించాలి. క్రమం తప్పకుండా టీకాలను వేయించాలి. ఈ టీకాలు వేయించినట్లయితే మూడు సంవత్సరముల వరకు వ్యాధి నిరోధకశక్తి అనేది ఉంటుంది. మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags