దూడ పుట్టిన వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తలు 

జిల్లా పాడి రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న పశుపోషణ సమాచారం: దూడ పుట్టిన వెంటనే ముక్కు రంధ్రాల నుండి, నోటిలో నుండి జిగురు పొరలను తుడిచి శుభ్రం చేయాలి. దూడకు జున్ను పాలు సమృద్దిగా తాగించాలి. ముఖ్యంగా దూడకు జున్ను పాలు ఈనిన 1 గంటలోపల అందివ్వాలి. ఈ సమయంలోనే జున్ను పాలలోని రోగ నిరోధక శక్తిని కలిగించే యాంటీ బాడీస్ అధికంగా వినియోగించుటకు వీలు అవుతుంది. దూడ పుట్టిన వెంటనే దూడ శరీరానికి సుమారు రెండు అంగుళాల దూరంలో బొడ్డును శుభ్రమైన నూలు దారంతో కట్టి కత్తిరించి అయోడిన్ ద్రావణాన్ని దారానికి మరియు బొడ్డు చుట్టూ పూయవలేను. ఇది యాంటీ సెప్టిక్ గా పని చేసి బొడ్డుగాయంను ఎండి పోయేటట్లు చేయును. దూడ పుట్టిన వారం రోజులకు ఒక సారి రోగ నిరోధకశక్తిని పెంచడానికి విటమిన్ A ఇంజక్షన్ ను వేయించాలి.మీరు మరింత సమాచారం కోసం రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెం 1800 419 8800 ను సంప్రదించగలరు.

 

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags