రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా వ్యవసాయ శాఖ వారు సంయుక్తంగా అందిచుచున్న వ్యవసాయ సమాచారం: వానాకాలం ప్రత్తి సాగు చేసే రైతులు పత్తి విత్తనాల విషయమై జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు. భారత ప్రభుత్వం అనుమతి లేని bt3 ప్రత్తి విత్తనాలను కొనరాదు మరియు అమ్మరాదు అలాగే సాగు చేయరాదు. ఈ విత్తనాలను అమ్మినా, కొని సాగు చేసినా, చట్ట పరమైన చర్యలు తీసుకొనబడును. కావున రైతులు లైసెన్స్ పొందిన అధీకృత డీలర్ల దగ్గర మాత్రమే విత్తనాలు కొని రశీదు పొందగలరని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయడమైనది.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.