బ్రూసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు మరియు నివారణ

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: బ్రూసెల్లోసిస్ వ్యాధి లక్షణాలు మరియు నివారణ:  బ్రూసెల్లోసిస్ అనేది ఒక బాక్టీరియా వ్యాధి, ఈ వ్యాధి చూడి గొర్రెలు మరియు మేకలలో నాలుగు నుండి నాలుగున్నర నెలల మధ్య గర్భస్రావాలకు కారణమవుతుంది. వ్యాధి సోకిన జీవాల యొక్క గర్భాశయంలో అంటువ్యాధులు సంభవిస్తాయి. గర్భస్రావం సమయంలో మాయ సేరు బయటకు రాక తరచుగా లోపల ఇరుక్కు పోవడం వల్ల జీవాల పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కొన్నిసార్లు, పశువుల కాపరులు గర్భస్రావం అయిన చనిపోయిన శిశువులు మరియు పిండాలను బహిరంగ ప్రదేశంలో పడవేస్తారు, దాని నుండి వ్యాధి క్రిములు ఇతర జంతువులకు వ్యాపిస్తాయి. కాబట్టి, పశువుల పెంపకందారులు ఈ చనిపోయిన శిశువులు మరియు పిండాలను భూగర్భంలో లోతైన గోతులలో పాతిపెట్టాలి. బ్రూసెల్లోసిస్ సోకకుండా నివారించడానికి ముందుగా టీకాలు వేయడం అవసరం.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags