చూడి మేకలలో మేతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు 

రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు జిల్లా పశు సంవర్ధక శాఖ వారు సంయుక్తంగా అందించుచున్న సమాచారం: చూడి మేకలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: చూడి మేకలను మంద నుండి వేరు చేయాలి. పొట్టేళ్ళతో కలవనియకూడదు. వేరుగా వసతి మరియు ఆరోగ్య రక్షణ కల్పించాలి. గర్భం దాల్చిన మేకలను మొదటి 4 నెలల్లో రోజుకు 4 నుండి 5 గంటలు మేయడానికి అనుమతించాలి. ఈ కాలంలో మేకలకు రోజు 5 కిలోల పచ్చి మేత అందుబాటులో ఉంచాలి. గర్భం దాల్చిన చివరి నెలలో 600 గ్రాముల పప్పు జాతి మరియు  ఎండు గడ్డి ని మేకలకు అందించాలి. చలి తీవ్రత ఉంటే పరదాలతో  షెల్టర్ ను కప్పాలి. పోషణలో కాల్షియం వంటి పోషకాలను ఉండేటట్లు దాణాను ఇవ్వాలి.  దీని వలన పిల్లలకు సరిపడా పాలు వస్తాయి. మేకలకు సరి అయిన వ్యాయామాన్ని కూడా చేయించాలి. చివరి నేలలో నట్టల నివారణ మందులను త్రాగించాలి. ఐరన్ టానిక్ లు ఇవ్వాలి. దీనివలన రక్తహీనత ఉండదు.

Content Files
Content Comments
Likes Dislikes
Comment Author Date
Be the first to post a comment...
Content Tags