రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి సమాచారం ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవస్థాపక దినోత్సవం సంధర్బంగా జూన్ 12వ తేదీన మన రాష్ట్రంలో మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం కొరకు మన వ్యవసాయ విశ్వవిద్యాలయం అనే నినాదంతో విత్తన మహోత్సవం మెగా సీడ్ మేళ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాం గుంటూరు నందు నిర్వహిస్తున్నారు. రానున్న తొలకరిలో పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతుల కొరకు నాణ్యమైన విత్తనాలను విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. ఈ సీడ్ మేళలో మన రాష్ట్ర ప్రధాన పంటలైన వరి, కంది, మినుము, పెసర, శెనగ, వేరుశెనగ, నువ్వులు రాగి, కొర్ర, జొన్న, లలో నూతన వంగడాల విత్తనాలు మరియు మామిడి, జీడి మామిడి, నిమ్మ, బొప్పాయి మొదలగు మేలైన నారు మొక్కలు అందుబాటులో ఉంటాయి. వ్యవసాయ సాంకేతిక ప్రదర్శనతో పాటుగా వివిధ వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రీయ ఉత్పత్తులు విక్రయానికి అందుబాటులో ఉంటాయి. ఈ సదావకాశమును రైతు సోదరులు అందరూ తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోగలరు.
| Comment | Author | Date |
|---|---|---|
| Be the first to post a comment... | ||
Copyright © 2026 Reliance Foundation. All Rights Reserved.